రేపు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

రేపు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. నవంబర్‌ నెల రూ.300 దర్శన టికెట్లు రేపు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రేపు ఉదయం 9 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. నవంబరు నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టికెట్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

టికెట్ల లభ్యతను బట్టి మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేస్తారు. నవంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్లు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయి.

అక్టోబరు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ నెల 22న ఉదయం 9 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇందులో బ్రహ్మోత్సవాలు జరిగే అక్టోబరు 1 నుంచి 5వ తేదీ వరకు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించరు.