వాస్తు: ఇంట్లో సమస్యలు కలుగకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ విధంగా వాస్తు పండితులు కనుక అనుసరిస్తే ఖచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు.

ఎప్పుడూ కూడా చెప్పులు లేదా షూ వేసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళకూడదు. అలానే పూజ గదిలోకి కూడా వేసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ చెప్పుల్ని కానీ షూ లని కానీ వేసుకుని వెళ్ళారంటే అది దురదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఎప్పుడు కూడా చెప్పులని బయట వదిలేయాలి.

చాలా మంది వంట గదిలో వంట చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకుని వంట చేస్తారు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీని తీసుకు వస్తుంది. కాబట్టి ఎప్పుడూ వంట గదిలో వంట చేసేటప్పుడు అసలు చెప్పులు వేసుకోకండి. అలానే ఎప్పుడూ కూడా ఇతరుల చెప్పులు అడిగి వేసుకోకండి. అదే విధంగా చిరిగిపోయిన చెప్పుల్ని, పాడైపోయిన చెప్పులుని వేసుకొద్దు.

ఇలా చేయడం వల్ల శని దేవుడి యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలానే ఒకవేళ మీరు నీళ్ల కి సంబంధించిన ఫీల్డ్ లో పని చేసినట్లైతే నీలం రంగు షూ లని వేసుకోవడం మానేయండి. ఐరన్ లేదా మెడికల్ ఫీల్డ్ లో పని చేసే వాళ్లు తెల్లటి షూ ని వేసుకోవడం మంచిది కాదు అని వాస్తు పండితులు అంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ చిట్కాలను అనుసరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి లేదు అంటే ఇబ్బందులు మీకు తప్పవని తెలుసుకోండి.