మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఆదివారం నాడు కొన్ని పనులని అస్సలు చేయకూడదు. ఆదివారం చేసే తప్పుల వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు అస్సలు ఈ పనులు చేయకూడదట. ఆదివారం సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. ఆదివారం నాడు బట్టల్ని వేసుకునేటప్పుడు బంగారం రంగు బట్టల్ని వేసుకోవడం మంచిది. లేదంటే నారింజ ఎరుపు రంగు బట్టలు వేసుకోండి.
గులాబీ రంగులు వేసుకుంటే కూడా మంచిదే. ఇలా ఈ దుస్తులు ధరించడం వలన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి కూడా వస్తుంది. ఆదివారం పూట నీలం, నలుపు బూడిద రంగు బట్టల్ని వేసుకోవద్దు. ఇటువంటి బట్టలను వేసుకుంటే చెడు జరుగుతుంది. ఆదివారం నాడు గోళ్లుని కత్తిరించుకోకూడదు జుట్టుని కత్తిరించడం కూడా తప్పు. ఆవాల నూనె ని తలకి రాసుకోవడం మంచిది కాదు.
కాబట్టి ఆదివారం ఈ తప్పు కూడా చేయకుండా చూసుకోండి ఆదివారంనాడు రాగితో తయారు చేసిన వస్తువులని కొనకండి. దాని వలన మీకే ఇబ్బంది. ఆదివారం మాంసం చేపలు మద్యం వంటివి తీసుకోకూడదు వీటికి దూరంగా ఉండాలి. ఆదివారం పూట గోధుమలను నీళ్లతో పాటు ఆవులకి పెడితే చాలా మంచిది. ఆదివారం నాడు కోతులకి నీళ్లు ఇవ్వడం కూడా మంచిది. ఇంట్లో గులాబీ మొక్కలని పెంచితే మంచి జరుగుతుంది ఆదివారం పూట సూర్యుని అనుగ్రహం ఉండాలంటే బచ్చలి కూరని తీసుకోవద్దు. ఉల్లి, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలి.