వాస్తు: ఇంటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది..!

-

ఇంట్లో తరచూ సమస్యలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబంలో కలహాలు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల ఇబ్బందులు రావు. అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాలను పండితులు చెప్పారు. మరి వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని కట్టుకున్నప్పుడు పిరమిడ్ ఆకారంలో బిల్డింగ్ కట్టుకుంటే మంచిది. అయితే అది ఎలా ఉండాలి అన్నది చూస్తే… ఇంటికి మధ్య భాగంలో కానీ లివింగ్ రూమ్ పైన కానీ ఆ పిరమిడ్ ఆకారం వస్తే బాగుంటుంది. పిరమిడ్ ఆకారంలో ఇల్లు ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

అందుకని మీరు లివింగ్ రూమ్ పైన పిరమిడ్ ఆకారం వస్తే మంచిది. ఇలా రావడం వల్ల జ్ఞాపకశక్తితో పాటు నిద్రలేమి సమస్యలు, తలనొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి. మీరు మీ ఇంటి పైన పిరమిడ్ ఆకారంలో కంస్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ త్రిభుజాకారం ఉత్తరం వైపు ఉన్నట్టు చూసుకోండి. ఇలా ఈ విధంగా మీరు అనుసరించారు అంటే సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు. అదే విధంగా ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. పైగా ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news