ఈశాన్య దిక్కులో ఇలా చేస్తే దరిద్రం తాండవం చేస్తుందట.. పొరపాటున కూడా అవి ఉంచకండి..!

-

ఆర్థిక ఇబ్బందులు మనిషి మానసికంగా చాలు కుంగదీస్తాయి.. కొంతమందికి సంపాదించే సోర్స్‌ లేక డబ్బులోటుతో ఉంటారు.. మరికొంతమంది డబ్బుబానే సంపాదిస్తారు.. కానీ వచ్చినదంతా.. అదే దారిన వెళ్లిపోతుంది. అనుకోని ఖర్చులు.. ఒక దాని తర్వాత ఒకటి వస్తుంటాయి. వచ్చేదాని కంటే.. పోయే లెక్క ఎక్కువ ఉంటుంది. అప్పులపాలు అవుతారు.. ఇలా తరచూ జరుగుతుంది అంటే.. మీకు ఏదో సమస్య ఉన్నట్లే లెక్క.. వాస్తు దోషం వల్ల కూడా ఇలా జరుగుతుంది.. ఇంట్లో ఏవి పడితే అవి ఉంచడం, పెట్టాల్సిన దిక్కులో కాకుండా వేరే దిక్కులో ఉంచడం ఇవన్నీ దోషాల..ఇంట్లో ఉంచిన వ‌స్తువుల‌ను వాస్తుకు అనుగుణంగా ఆయా దిశ‌ల్లో ఉంచాల‌ని నిపుణులు అంటున్నారు..

ముందుగా సంప‌ద దేవుడైన కుబేరున్ని సంప‌న్నం చేసుకోవాలి. ఆయ‌న మ‌న్నించిన‌ప్పుడు అదృష్టం, సంప‌ద కురుస్తాయి. ఉత్త‌రం కుబేరునికి మంచి ప్ర‌దేశం. సంప‌ద పెరుగుతుంది. కాబ‌ట్టి ఉత్త‌రం దిక్కును శుభ్రంగా, ఎన‌ర్జిటిక్‌గా, పాజిటివ్ ఎన‌ర్జీ ఉండేలా చూసుకోవాలి. ఇది సంప‌ద పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

ఇంట్లో ఈశాన్య దిశ‌లో ఎటువంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌దు. ఈశాన్య మూల‌న గాలి, వెలుతురు వ‌చ్చేలా చూసుకోవాలి. ఈశాన్యంలో ఎటువంటి అడ్డంకులు ఉంచ‌కూడ‌దు. చెత్త‌, చెదారాల‌ను కూడా ఉంచ‌కూడ‌దు. ఈశాన్య దిశ సిరిసంప‌ద‌ల‌కు అనుకూలిస్తుంది.అదే విధంగా ఇంటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంట్లో ప‌నికిరాని వ‌స్తువుల‌ను, చెత్తా చెదారాలను ఉంచుకోకూడదు.. పారేస్తూ ఉండాలి. ఇంటి ప్ర‌ధాన ద్వారానికి నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్ల‌తో కూడిన పోల్స్ లేకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశలో బ‌రువులు ఉంచొద్దు.. నీటి ట్యాంకులు లేకుండా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌రిద్రం పోతుంది. ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహం వ‌స్తుంది. డ‌బ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో వాటర్‌ లీకేజ్‌ ఉండకూడదు.. ట్యాప్‌ ద్వారా ఎప్పుడూ వాటర్‌ లీక్‌ అవుతుంటే.. వెంటనే వాటిని సరిచేయించండి.. నీరు వృద్ధగా పోతే..డబ్బు కూడా అలానే వృధాగా పోతుందని పండితులు అంటున్నారు. కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఏ ఇంట్లో అయితే నీటిని జాగ్రత్తగా వాడతారో.. ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు.. చిన్నపనికి కూడా నీటిని అనవసరంగా వేస్ట్‌ చేయడం, ట్యాప్‌ ద్వారా ఎప్పుడూ నీళ్లు కారుతూ ఉండటం దరిద్రానికి సంకేతాలే..!

Read more RELATED
Recommended to you

Latest news