వాస్తు: పూజ గదిలో ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే చిక్కులే..!

-

వాస్తు ని ఫాలో అయితే ఏ విధమైన సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. చక్కగా పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. మీరు కూడా వాస్తుని అనుసరిస్తూ ఉంటారా వాస్తు ప్రకారం నిజంగా నడుచుకుంటే ఎటువంటి కష్టాలు అయినా తొలగిపోతాయి. పూజ గది విషయంలో ఈ టిప్స్ ని పాటిస్తే ఖచ్చితంగా ఆనందంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు మరి పూజ గదిలో పాటించాల్సిన చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఎరుపు రంగు బల్బును ఉంచకూడదు దీనివల్ల ప్రశాంతత కలగదు. తెల్లని బల్బ్ ని ఉంచితే పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది కాబట్టి పూజ గదిలో మీరు ఎర్రటి బల్బుని కాకుండా తెలుపు రంగు బల్బుని ఉంచండి.

అదే విధంగా పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను వుంచద్దు. వీటి వల్ల నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది.దేవుడికి పెట్టిన పూలు వాడి పోయిన తర్వాత తీసేయాలి లేదంటే అది నెగిటివ్ ఎనెర్జీని తీసుకొస్తుంది. పైగా అలా ఉంచడం మంచిది కాదు కూడా.

ఎప్పుడు కూడా వంటగదిలో పూజగది ఉండకూడదు. మెట్ల కింద కూడా పూజ గది ఉండకూడదు బెడ్ రూమ్ లో కూడా చాలా మంది దేవుడు మందిరం ఉంచుతారు. అలా చేయడం కూడా తప్పు కాబట్టి ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. తద్వారా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news