ఇప్పుడు ఇంటర్నెట్ కాలం నడుస్తుంది.. ప్రతిదీ నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రపంచంలోని ఎటువంటి విషయం అయిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఇకపోతే ఏదేని ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగితే చాలు.. అది మరింతగా వైరల్ అవుతుంది. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాంటి వాటిని జనం ఎక్కువగా ఆదరిస్తుంటారు. తాజాగా ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ ట్రెండవుతోంది. సదరు వీడియోలో ఒక ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధ దంపతులు భోజనం చేస్తున సన్నివేశం.. ఈ వీడియో ను ఐఏఎస్ అధికారిణి డాక్టర్ సుమితా మిశ్రా ట్విట్టర్ లో షేర్ చేశారు.. ఆ వీడియోను చూసిన వారంతా స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు.
అధికారిణి డాక్టర్ సుమితా మిశ్రా హర్యానా వ్యవసాయం, రైతుల సంక్షేమం అదనపు ప్రధాన కార్యదర్శి, హర్యానా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ సుమితా మిశ్రా తరచుగా ట్విట్టర్ లో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోలను పంచుకుంటారు. ఈ క్రమంలోనే సుమితా మిశ్రా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.
ఆ వీడియోలో ఒక వృద్ధ దంపతుల మధ్య తరగని ప్రేమ, అప్యాయత కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వృద్ధదంపతులు నేలపై కూర్చుని ఆహారం తింటున్నారు. ఇందులో ఆ వృద్ధుడికి ఏ మాత్రం ఓపిక లేదు.. తన చేతులతో స్వయంగా ఆహారం కూడా తినలేక పోతున్నాడు.. అందుకు ఆ వృద్ధురాలు తానే అతడికి ఆహారం తినిపిస్తుంది. ఈ వయసులో కూడా ఆ వృద్ధురాలు తన భర్తకోసం పడుతున్న తపన నెటిజన్లను కట్టిపడేసింది.. వారి ప్రేమ అందరికి ఆదర్షంగా నిలిచింది..ఆ ప్రేమను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..నిజమైన ప్రేమ అంటే ఇదే..
शब्द नहीं है इस लम्हे को बयां करने के लिए!
को यह भी नहीं कह सकता कि इन्होंने शोहरत पाने के लिए यह प्यार किया होगा!
प्यार अनंत है! https://t.co/e25jSI6PZY— gyanendra pandey (@gyanendra0707) September 19, 2022