వాస్తు: వంటిల్లు అదృష్టాన్ని తెస్తుంది.. అందుకే ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. చాలా మంది ఈ మధ్యన వాస్తు పండితుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. నిజానికి వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి.

 

మనం ఇప్పుడు పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూసేద్దాం. వాస్తు ప్రకారం వంటిల్లు వలన అదృష్టం విజయం ఆధారపడి ఉంటుంది వంట గదిలో అన్నపూర్ణ దేవి ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయకూడదు దీని వలన చెడు ఫలితాలు ఎదురవుతాయి.

వంటింట్లో వంట చేసినప్పుడు ఎప్పుడు కూడా తూర్పు వైపు తిరిగి వంట చేయాలి. ఎప్పుడూ ఉత్తరం వైపు నించుని వంట చేయకూడదు దీని వలన సమస్యలు ఎదురవుతాయి.
వంటింట్లో అన్నపూర్ణ దేవి ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే నల్లటి వస్తువులని వంట గదిలో ఉపయోగించకండి వీలైనంత వరకు తగ్గించడం మంచిది. నలుపు రంగు నెగిటివిటీ ని తీసుకు వస్తుంది కాబట్టి వీలైనంత వరకు వాడకండి. అలానే వంటగదిలో చెత్తని పెట్టొద్దు, డస్ట్ బిన్ వంటి వాటిని కూడా వంటింట్లో ఉంచకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి పాజిటివ్ ఎనర్జీ ని దూరం చేస్తాయి.

చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని.. మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news