బరువు తగ్గాలంటే.. వ్యాయామం చేయాలి, డైట్ పాటించాలి.. ఇవన్నీ చేస్తే.. బరువు తగ్గడమే కాదు.. ఎప్పుడూ ఆరోగ్యంగా కూడా ఉంటారు. బాడీ మంచి షేప్‌లో ఉంటుంది. ఎలాంటి బట్టలు వేసినా అందంగా కనిపిస్తారు.. బరువు తగ్గేందులు సులభమైన మార్గం..బెల్లం.. రోజూ ఒక ముక్క బెల్లం తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిది.. బెల్లం, నిమ్మరసం బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తాయట.. పొట్టలో కొవ్వను వెన్నలా కరిగించే శక్తి ఈ రెండింటింకి ఉందని ఆయుర్వద నిపుణులు అంటున్నారు.
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుందని మనకు తెలిసిన విషయమమే. ఇది శరీరంలో ఎల్లప్పుడూ ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. శరీర మెటబాలిజంను పెంచుతుంది. నిమ్మరసంలో ఉండే పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు బరువును తగ్గించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇవి కొవ్వును కరిగిస్తాయి. శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతోపాటు శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే.. క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
చక్కెరను వాడొద్దనుకునే వారికి బెల్లం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బెల్లంలో ఉండే జింక్, సెలీనియంలు శరీర రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను బయటకు పంపుతాయి. అలాగే మెటబాలిజాన్ని పెంచి క్యాలరీలు ఎక్కువగా ఖర్చయ్యేలా చేస్తాయట…నిత్యం బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ శుభ్రమవుతాయి. బరువు ఈజీగా తగ్గొచ్చు..
నిమ్మరసం, బెల్లం రెండింటినీ కలిపి నిత్యం తీసుకుంటే…
నిమ్మరసం, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఇవి రెండూ సూపర్ ఫుడ్స్ కనుక అధిక బరువు త్వరగా తగ్గుతారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ నిమ్మరసం, చిన్న బెల్లం ముక్కను వేసి బాగా కలపాలి. బెల్లం నీటిలో కరిగేంత వరకు కలిపి ఆ నీటిని తాగాలి. దీన్ని నిత్యం పరగడుపునే తాగాలి. కావాలంటే అందులో కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. దీంతో ఆ పానీయానికి తాజాదనం, వాసన వస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతుంది.. బెల్లం ఎంచుకోవడం మాత్రంలో జాగ్రత్త.. మార్కెట్లో నాణ్యత కలిగిన బెల్లాన్నే తీసుకోవాలి..!