వాస్తు: ఇంట్లో ఇవి జరిగితే అశుభానికి సూచనని తెలుసా..?

వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అదే విధంగా మనం ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఇంట్లో జరిగే సందర్భాల వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లో కనుక ఇవి జరిగితే అవి నిజంగా అశుభానికి సూచనే. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

పాలు:

పాలు తెల్లటి పదార్థాలు లో చాలా ముఖ్యమైన పదార్థం. పాలు కనుక కింద ఒలికిపోతే అది అశుభానికి సూచన. కానీ పాలు స్టవ్ మీద నుంచి కిందకి పడటం అనేది శుభాన్ని సూచిస్తుంది అందుకే గృహప్రవేశ సమయంలో పాలను పొంగిస్తారు.

తెల్ల నువ్వులు:

తెల్ల నువ్వులు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తెల్ల నువ్వులు చేతిలో నుంచి కింద పడి పోవడం అనేది అశుభాన్ని సూచిస్తుంది కాబట్టి ఎప్పుడూ తెల్ల నువ్వులను జార్చద్దు.

సాల్ట్:

సాల్ట్ కింద పడిపోవడం కూడా మంచి చిహ్నం కాదు. ఇది కూడా అశుభాన్ని సూచిస్తుంది చేతిలో నుండి సాల్ట్ కింద పడిపోతే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలాగే పలు రకాల సమస్యలకు దారి తీస్తుంది.

బియ్యం:

చేతిలో నుండి బియ్యం ఒలికిపోవడం కూడా మంచిది కాదు. బియ్యం ఒలికితే చెడు వార్త వినాల్సి వస్తుంది.

నూనె:

నూనె కింద పడడం కూడా అశుభాన్ని సూచిస్తుంది కాబట్టి ఇటువంటి వస్తువులని మీ చేతులతో సర్దేటప్పుడు కానీ పట్టుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకోవద్దు.