వాస్తు: ఉదయం లేచాకా వీటిని అస్సలు చూడద్దు.. చిక్కులే రోజంతా..!

-

వాస్తు: వాస్తు ని అనుసరించడం వలన ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు అలా చేస్తే సమస్యలు ఏమి లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఉదయం లేచిన తర్వాత మనం కొన్ని వాటిని చూడకుండా ఉంటే ఎంతో మంచి కలుగుతుంది కొన్ని వాటిని మనం లేచిన వెంటనే చూస్తే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని లేచిన వెంటనే కొన్నిటిని అస్సలు చూడకూడదు ఇలాంటివి చూడడం వలన ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఉదయం లేచాక వీటిని చూడకండి.

ఉదయం లేచిన వెంటనే పాజిటివ్ ఎనర్జీ కలిగించేటట్టు చూసుకోవాలి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా మీరు ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత ఎంత పాజిటివ్ ఎనర్జీతో లేస్తే రోజంతా అంతే పాజిటివ్ గా మీరు ఉండొచ్చు పైగా ఉదయాన్నే మీరు ఇబ్బందులతో మొదలుపెడితే రోజంతా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కోపంగా చూసే పక్షులు జంతువుల ఫోటోలను ఉదయం లేస్తూనే చూడకండి వీటివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది క్రూర మృగాలు తాలూకా ఫోటోలను ఇంట్లో పెడతారు అటువంటివి ఉదయం లేచిన వెంటనే చూస్తే చెడు జరుగుతుంది.

ఉదయం లేచిన వెంటనే మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకోకూడదు దీని వలన కూడా సమస్యలు వస్తాయి అని వాస్తు పండితులు అంటున్నారు. ఇతరుల యొక్క నీడని కూడా మనం అసలు లేచిన తర్వాత చూడకూడదు ఉదయం లేచాక నీడని చూస్తే కూడా భయం టెన్షన్ పెరుగుతాయి. ఉదయం లేచిన తర్వాత అంట్ల గిన్నెలు వంటివి చూడకూడదు ఇవి కూడా నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి కాబట్టి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి ఉదయం లేచాక మీరు మీ ఇష్ట దైవాన్ని చూడడం మీకు ఇష్టమైన వాళ్ళ ముఖాన్ని చూడడం వంటివి చేయండి ఇలా రోజు ని మొదలు పెడితే అంతా మంచే జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news