లావు: పెళ్లి తర్వాత చాలామంది ఆడవాళ్లలో మార్పు వస్తుంది. చాలా మంది ఆడవాళ్లు పెళ్లి తర్వాత బరువు పెరిగిపోతూ ఉంటారు. ఎంత సన్నగా ఉన్నవాళ్లు అయినా సరే ఒళ్ళు చేస్తారు అయితే ఎందుకు ఆడవాళ్లు పెళ్లి తర్వాత బరువు పెరిగిపోతారు..? దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం… పెళ్లయిన తర్వాత కొత్తలో సంతోషం ఆనందం ఎక్కువ ఉంటుంది దీంతో బరువు పెరిగిపోతారు.
ఆడవాళ్లు పెళ్లి అయ్యాక బరువు ఆటోమేటిక్ గా పెళ్లి తర్వాత పెరిగిపోతారని స్టడీ ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే పెళ్లి తర్వాత దంపతులు శారీరకంగా కలవడం వలన బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అది కేవలం పాక్షికమే అని అంటారు. పెళ్లి తర్వాత తినే ఆహారంలో మార్పు వస్తుంది. ఆహారాన్ని తినే టైంలో మార్పు వస్తుంది. అలానే ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇది బరువు పెరిగిపోవడానికి దారితీస్తుంది.
కొందరిలో అయితే పెళ్లయిన తర్వాత ఒత్తిడి పెరుగుతుంది అప్పుడప్పుడు గొడవలు కూడా వస్తూ ఉంటాయి దీంతో భావోద్వేగానికి గురై చాలామంది ఎక్కువ తింటూ ఉంటారు. ఇలా కూడా బరువు పెరిగిపోతారు ఆడవాళ్లు. గర్భధారణ కూడా ఇంకో కారణం పిల్లలు పుట్టడం వలన ఆడవాళ్లు బరువు పెరుగుతారు.
పెళ్లికి ముందు చాలామంది ఆడవాళ్లు డైటింగ్ చేయడం వ్యాయామం చేయడం వంటి వాటికోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. కానీ పెళ్లి తర్వాత వ్యాయామం చేయడం మానేస్తారు ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. అలానే కొంచెం తినే ఆడవాళ్ళు ఆహారం ఎక్కువ మిగిలిపోతుందని మిగిలిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు ఇది కూడా పెళ్లి తర్వాత బరువు పెరగడానికి కారణమే. ఇలా ఈ కారణాల వలన మహిళలు పెళ్లి తర్వాత బరువు పెరిగిపోతారు.