వాస్తు: ఇంట్లో వేసుకునే రంగుల విషయంలో ఈ తప్పులు చెయ్యద్దు..!

-

ఇంట్లో వాస్తుని అనుసరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోతుంది. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చాలా మంది ఇంటి విషయంలో వాస్తు చిట్కాలు అనుసరిస్తుంటారు. దీని వల్ల ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రంగులు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఇబ్బందులను కూడా దూరం చేసేటట్టు చేస్తాయి.

కొన్ని రంగులు చూస్తే ఎంతో భయంకరంగా ఉంటుంది. దీని వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే వాస్తు ప్రకారం కొన్ని రంగులను ఇంటికి వేసుకోవడం మంచిది అని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తును ఇంట్లో పాటించడం వల్ల కెరీర్ అభివృద్ధి అవుతుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంటికి ఆగ్నేయ దిశలో నారింజ రంగు, గులాబి రంగు, పసుపు రంగు వేస్తే మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది.

ఉత్తర భాగంలో అయితే ఆకుపచ్చ, పిస్తా రంగు వేస్తే బాగుంటుంది. ఈ రంగులు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉత్తరం వైపైతే స్కై బ్లూ కలర్ వేస్తే మంచిది. అదేవిధంగా పడమర వైపు అయితే నీలం రంగు వేస్తే బాగుంటుంది.

బెడ్రూంలో అయితే గులాబీ రంగు వేస్తే బాగుంటుంది. లేదంటే స్కై బ్లూ కలర్ బాగుంటుంది వీటి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. వీలైతే అన్ని గదుల్లోనూ ఇంటిపైకప్పు భాగంలో తెలుపు రంగు వేసుకోండి. దీనివల్ల ప్రశాంతత ఉంటుంది. సౌత్ వైపు చూసుకుంటే ఆరెంజ్ కలర్ బాగుంటుంది లేదంటే గులాబీ రంగు వేయడం మంచిది. ఇలా ఈ విధంగా వాస్తుని అనుసరించడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news