వాస్తు: కార్లలో వీటిని ఉంచితే సమస్యలే వుండవు..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కార్లకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం కార్లలో ఈ మార్పులు చేయడం వలన సమస్యలను తొలగించుకోవచ్చు. చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. కానీ కార్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు లేకుండా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నచ్చిన దేవుడిని ఉంచండి:

నచ్చిన దేవుడు విగ్రహాన్ని మీరు కారులో పెడితే మంచిది లేదంటే గణపతి విగ్రహాన్ని అయినా పెట్టొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని కార్లలో ఉంచడం వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వినాయకుడి విగ్రహాలు పెడితే యాక్సిడెంట్లు వంటివి అవ్వవు. లేదంటే హనుమంతుడి బొమ్మ ని హ్యాంగ్ చేయొచ్చు.

తాబేలు:

నల్లటి తాబేలుని కూడా మీరు కారులో పెట్టుకోవచ్చు ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ ని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. మంచి మ్యూజిక్ ని కారులో పెట్టడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

టిబెటియన్ జెండాలు:

ఈ జెండాలని కార్లలో ఉంచడం వలన కూడా చాలా మంచి కలుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు.

రాయిలు:

ఏదైనా నాచురల్ స్టోన్స్ ని కారులో ఉంచడం వలన కూడా చక్కటి ప్రయోజనాలను పొందచ్చని వాస్తు పండితులు అంటున్నారు. నాచురల్ స్టోన్స్ కానీ క్రిస్టల్స్ ని కానీ కారు డాష్ బోర్డు మీద పెట్టుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు ఇలా సమస్యలకు దూరంగా ఉండి మంచిని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news