వాస్తు: ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకోకపోతే సమస్యలేనట..!

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది పైగా చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టే ముందు వాస్తు చూపిస్తారు. అయితే వాస్తు ప్రకారం వీటిని కనుక ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి.

పైగా వాస్తుని అనుసరించడం వల్ల ఇంట్లో మంచి కలుగుతుంది గొడవలు వంటివి రావు. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలుని చెప్పారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే గోడలకి ఆకుపచ్చ రంగు వేసుకోవడం మంచిది కాదు దీనికి గల కారణం ఏమిటంటే ఆకుపచ్చరంగు పిశాచాలకు చాలా ఇష్టం అందుకే అంటుంటారు. కనుక ఆకు పచ్చ రంగును గోడలకు వేయడం అరిష్టం. పైగా ఆకుపచ్చ గోడలు తడిగా ఉంటే విష వాయువులను విడుదల చేస్తాయి కాబట్టి ఆకుపచ్చరంగు ఇంట్లో వేయించుకోకండి.

ఇళ్లల్లో విరిగిపోయిన గడియారాలు ఉండకూడదు పనిచేయని గడియారాలు కూడా ఉండకూడదు అదే విధంగా ఇంట్లో పాత సామాన్లు మరియు పనికిరాని సామాన్లన్నీ ఉంచకూడదు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఏవైనా పనికిరాని సామాన్లని ఇంటి బయట మాత్రమే ఉంచాలి ఇంటి లోపల ఉంచితే నెగిటివ్ ఎనర్జీ కలిగే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అదేవిధంగా ఇంట్లో గొడుగుని తెరచి ఉంచకూడదు ఇంట్లో గొడుగును తెరిచి ఉంచితే ఆత్మలకు అనుకూలమని అంటారు. ఎండిపోయిన మొక్కలు కూడా ఇంట్లో ఉంచకూడదు ఇలా ఈ విధంగా ఫాలో అయితే ఎటువంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు.