వాస్తు: స్టడీ రూమ్ కోసం ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ పిల్లలు ర్యాంకులు సాధించడం ఖాయం..!!

-

ఇంట్లో ఎటువంటి పని చెయ్యాలని అనుకున్నా కూడా వాస్తు ప్రకారం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. అలా చెయ్యడం వల్ల మనకు ఎటువంటి భాధలు ఉండవని అంటున్నారు.వాస్తు ప్రకారం లేకుంటే కుటుంబంలో ఎప్పుడూ ఏదొక చికాకులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడం స్టడీ రూమ్ ను ఏర్పాటు చేయాలి.

మీ పిల్లలు ఏ స్థలంలో కూర్చుని చదువుకుంటారో ఆ ప్రదేశం వాస్తూరీత్యా సరైనది అయి ఉండాలి. అప్పుడు వారి భవిష్యత్తు దేదీప్య మానంగా వెలిగిపోతుంది. ఇల్లు కట్టేటప్పుడే స్టడీ రూం ఎక్కడ ఉండాలనేది గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారం, స్టడీ రూమ్ లేకపోతే, మీరు ఏకాగ్రతతో, అధ్యయనం చేయలేరు. పిల్లల మనస్సు చదువుపై నిమగ్నమై ఉండదు. దీనివల్ల వెనుకబడిపోతారు. వాస్తు ప్రకారం స్టడీ రూమ్ ఏ విధంగా ఉండాలి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం స్టడీ రూమ్ ను ఎలా ఏర్పాటు చేయాలంటే..

*. వాస్తు ప్రకారం, స్టడీ రూమ్‌ను పశ్చిమ దిశలో మధ్యలో ఉంచడం మంచిది.

*. స్టడీ రూమ్ కిటికీలు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండేలా చేయాలి, తద్వారా అక్కడ సరైన కాంతి మరియు సానుకూల శక్తి వస్తుంది.

*. స్టడీ రూమ్ ద్వారం తూర్పు, ఉత్తరం లేదా పడమర దిశలో పెట్టాలి.

*. మీ స్టడీ రూం లో ఈశాన్యంలో మాత సరస్వతి చిత్రపటాన్ని ఉంచాలి.

*. స్టడీ రూమ్‌లో చదువుతున్నప్పుడు, మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి.

*. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను స్టడీ రూమ్‌లోని ఆగ్నేయ కోణంలో ఉంచండి. దానికి ఇదే సరైన స్థలం.

*. స్టడీ రూమ్ రంగును పసుపు లేదా కుంకుమ రంగులో ఉంచుకోవాలి, ఇది కాకుండా ఆకుపచ్చ రంగు కూడా మంచిదట..

*. పడమర మరియు ఆగ్నేయ కోణాల మధ్య స్టడీ రూమ్‌ను తయారు చేయడం సాధ్యం కాకపోతే, మీరు దానిని ఈశాన్యంలో కూడా నిర్మించుకోవచ్చు.. ఈ వాస్తు టిప్స్ పాటించి స్టడీ రూమ్ ను ఏర్పాటు చేస్తే పిల్లలకు మంచి ర్యాంకులు రావడం పక్కా..

Read more RELATED
Recommended to you

Latest news