వాస్తు: కెరీర్ లో పైకి రావాలంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు.

అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కేరీర్ కి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం మనం కెరీర్ లో సక్సెస్ పొందాలంటే కచ్చితంగా ఈ విషయాలని అనుసరించాలని వాస్తు పండితులు అంటున్నారు. మరి పండితులు చెప్పే అద్భుతమైన చిట్కాలని చూసేద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈశాన్యం మూలన శుభ్రం లేకపోతే మీ యొక్క కెరియర్ ఆగిపోతుంది. సక్సెస్ ని పొందడానికి అవ్వదు. ఆనందం కూడా ఉండదు.
ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటైన్ ని పెట్టడం కూడా మంచిది. వాటర్ ఫౌంటైన్ ని ఈశాన్యం వైపు పెడితే మీ యొక్క ఎదుగుదల బాగుంటుంది. అయితే వాటర్ ఫౌంటెన్ ని పెట్టినప్పుడు దానికి ఎటువంటి లైట్లు లేకుండా ఉండేటట్టు చూసుకోండి.
ఉత్తరం వైపు ఉండే అలమరాలో మీ యొక్క డబ్బులని విలువైన సామాన్లుని పెట్టుకోండి. ఈశాన్యం వైపు పూజ గది ఉండేటట్టు చూసుకోండి ఇది కూడా మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది.
నిద్రపోయేటప్పుడు మాత్రం తూర్పు వైపున తల పెట్టుకుని నిద్రపోండి. దీని వలన ఏకాగ్రత పెరుగుతుంది. మెంటల్ స్టెబిలిటీ పెరుగుతుంది ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఖచ్చితంగా కెరీర్ లో సక్సెస్ ని పొందేందుకు అవుతుంది ఎలాంటి ఇబ్బందులు కూడా రావు.