వాస్తు: మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు మార్గాలు ఇవే..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం కనుక మీరు ఇలా చేశారంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోవాలనుకుంటే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించండి వీటిని పాటిస్తే ఆనందంగా ప్రశాంతంగా జీవించేందుకు అవుతుంది. మెడిటేషన్ చాలా మంచి టెక్నిక్ మెడిటేషన్ చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఆనందంగా ఉండొచ్చు. అయితే ఒత్తిడి తగ్గి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తెలుపు రంగు లేదంటే పసుపు ఆకుపచ్చ రంగు కొవ్వొత్తులని వెలిగించండి.

 

ప్రశాంతత ఉంటుంది ఆనందంగా ఉండొచ్చు. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అగర్బత్తి వంటివి మంచి సువాసనని కలిగి ఉంటాయి. ఇటువంటి వాటిని ఇంట్లో వెలిగిస్తే కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ముఖద్వారం దగ్గర బాగా అందంగా ఉంచుకోవడం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలన్నా మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా బెడ్ రూమ్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలానే భార్య భర్తలు నిద్రపోయేటప్పుడు తల దక్షిణం వైపున కానీ తూర్పు వైపు కానీ పెట్టుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఇంట్లో చెత్తా చెదారాన్ని తొలగించాలి చాలా మంది ఎక్కువ చెత్తా చెదారాన్ని ఇంట్లో ఉంచుతారు ఇవి నెగిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తాయి. పాత ఎలక్ట్రానిక్ సామాన్లు పాత ఫర్నిచర్ ఇటువంటివన్నీ కూడా ప్రశాంతతను దూరం చేస్తాయి. సో ఆ తప్పును చేయకండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే మంచి కలర్స్ ని ఉపయోగించండి. గోడలకి వేసే పెయింట్లు మొదలు ఇంట్లో వాడే బెడ్ షీట్ల వరకు ఇవన్నీ కూడా మంచి వైబ్రేషన్స్ తీసుకువచ్చే రంగులు అయి ఉండాలి. ఇంటి ముఖద్వారం ఎదురుగా చెత్తబుట్ట షు ర్యాక్ వంటివి ఉండకూడదు ఇలా వాస్తు ప్రకారం వీటిని ఫాలో అయ్యారంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news