Viral video: ఆలయంలో శివ లింగం పై మంచు..దేవుడు మహిమేనా?

-

కొన్ని ప్రకృతి వైపరీత్యాలను చూస్తే నిజంగా దేవుడే ఇదంతా చేస్తున్నాడా అని నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆలయాల్లొ జరుగుతున్న కొన్ని సంఘటనలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.ప్రసిద్ధ ఆలయంలోని శివలింగంపై మంచు పడింది. ఐస్‌ మాదిరిగా ఉన్న దీనిని చూసి ఆలయంలోని పూజారితోపాటు భక్తులు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ప్రముఖ త్రయంబకేశ్వర ఆలయంలో ఈ వింత జరిగింది.

ఆలయంలోని శివలింగానికి పూజారి పూలతో అర్చన చేశారు. అయితే కొంత సేపటి తర్వాత శివలింగం పైభాగంలో తెల్లగా మంచు మాదిరిగా ఏర్పడింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ పూజరి శివలింగంపైన ఉన్న పూలను తొలగించారు. ఐస్‌గడ్డ మాదిరిగా ఉన్న మంచును చేతితో తడిమి చూశారు..అంతా చల్లగా, తెల్లగా మారింది. ఒక్కసారిగా లింగం ఇలా మారడం పై భక్తులు దేవుడు మహిమ అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇందుకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహలో అమరేశ్వర్ మహాదేవ్ రూపంలో ఏర్పడే మంచు శివలింగాన్ని వేలాది మంది భక్తులు ప్రతి ఏటా సందర్శిస్తుంటారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమైంది. ఈ తరుణంలో త్రయంబకేశ్వర ఆలయంలోని శివలింగంపై మంచుగడ్డ ఏర్పడటాన్ని అద్భుతమని, మహిమ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.మీరు ఒకసారి ఆ మంచు లింగాన్ని దర్శించుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news