సోదరి ఇంట్లో ఈ రోజు భోజనం చేస్తే ఈ దోషాలు పోతాయట!

-

కార్తీక మాసంలో శుద్ధ విదియకు భగినీ విదియ అని పేరు. ఈ రోజున ఏం చేయాలి, అలా చేస్తే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం.. భగినీ హస్త భోజనం అంటే అక్క/చెల్లలు ఇంట్లో అన్న లేదా తమ్ముడు భోజనం చేయడం. అక్క లేదా చెల్లె వడ్డించగా భోజనం చేసి వారి ప్రేమానురాగాలను మరింత బలోపేతం చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. పురాణాల ప్రకారం.. సూర్య భగవానికి ఒక కుమారుడు ఒక కుమార్తె. వారి పేర్లు యమధర్మరాజు, యమున. యమునకు అన్న అంటే విపరీతమైన అభిమానం.
అమె అన్నగారు యమధర్మరాజు గారిని ఎన్నోసార్లు తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలం గడచిపోతూ ఉంది.

అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలు ఇంటికి వెళదామని అనకున్నాడు. ఆ రోజు కార్తీక శుద్ద విదియ యమధర్మరాజు చెల్లెలు యమున ఇంటి వచ్చాడు. రాకరాక వచ్చిన అన్నయ్య ను చూచి చెల్లెలు యమున సంతోషంగా అన్నయ్యకు ఇష్టమైన. పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. యమధర్మరాజు తృప్తిగా భోజనం చేసి చెల్లెలుతో ప్రేమగా చెల్లీ నాకు ఇషమైన పదార్థములుతో భోజనం పెట్టావు. నీకు ఏదైనా వరం ఇస్తానని చెప్పగా యమున అన్నయ్యా లోకకల్యాణం కోసం నాకు ఒక వరం ఇవ్వు.

ఈ రోజున ఎవరైనా అక్క లేదా చెల్లెలు ఇంటికి ఏ అన్నయ్య లేదా తమ్ముడు వెళ్లి భోజనం చేస్తాడో నీవు ఎట్టి పరిస్థితిలో వారి జోలికి వెళ్ళవద్దు. ఇది నా కోరిక అనగా లోకకల్యాణం కోసం అడిగావు కనుక తధాస్తు అన్నాడు యమధర్మరాజు. ఆ విధంగా తన చెల్లెలును దీవించి వెళ్ళాడు. అనగా రేపటి రోజున. అక్క లేదా చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషాలు ఉండవు.
అదండీ సంగతి. ఇక ఆలస్యమెందుకు వెంటనే అక్క/చెల్లలు ఇంటికి వెళ్లి భోజనం చేసి రండి. అపమృత్యు దోషం నుంచి విముక్తి పొందండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news