మనదేశంలోని ప్రముఖ శివాలయాలు ఎక్కడున్నాయి? ఆలయ ప్రత్యేకతలు..

-

మహా శివుడికి ఇష్టమైన మాసాల్లో ఒకటి శ్రావణమాసం..పరమేశ్వరుడికి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఎక్కడున్నాయి.. శ్రావణ మాసంలో ఏ శివాలయాలను దర్శించుకోవాలి, వాటి ప్రాముఖ్యతలేంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

శివుడిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.. బోలేనాథుడు, కైలాసనాథుడు, కాశీ విశ్వనాథుడు, కేథరేశ్వరుడు, సోమనాథుడు, బైద్యనాథ, బద్రినాథ, రామనాథ, అమర్ నాథ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్యకు ఉన్నాయి. సాధారణంగా మహా శివరాత్రి పండుగ సమయంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. అయితే శ్రావణ మాసంలో కూడా శివాలయాలు అందంగా ముస్తాబవుతాయి..ఇక ఈ మాసంలో సందర్సించాల్సిన శివాలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

సోమనాథుడు..

గుజరాత్ లోని ఈ శివాలయానికి గొప్ప చరిత్ర ఉందని ప్రముఖులు చెబుతున్నారు..ఒకప్పుడు అపారమైన సంపద ఉండేదని, మధ్య యుగంలో ఈ గుడిపై పదే పదే దాడి చేసి వాటిని ఎత్తుకెళ్లారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇది కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయంలోని శివుడిని సోముడు అని పిలుస్తారు. ‘సోమ’వారానికి సోమనాథుడికి ఓ లింక్ ఉంది. అందుకే శివునికి సోమవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తారు.

శ్రీ కైలాస నాథుడు..

శైవ క్షేత్రం కైలాసగిరి. ఇక్కడ కైలాస నాథుడి ఆలయం ఉండటం వల్లే ఈ ప్రాంతానికి కైలాసగిరి అనే పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. ఓంకార స్వామిజీ అనే వ్యక్తి తన తపో శక్తిని ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్టించారు. అప్పటినుంచి ఈ ప్రాంతం పరమశివుని ప్రత్యేక ప్రాంతంగా పేరు గాంచింది. ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఏమైనా కోరుకుంటే అవి కచ్చితంగా నెరవేరుతాయట. కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ ఆలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేయాలని స్థానికులు చెబుతారు…ఇది విశాఖపట్నంలో ఉంది..

కోటి లింగేశ్వరుడు..

పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో దాదాపు కోటి లింగాలు మనకు కనిపిస్తాయి. 1972లో ఇక్కడ మొట్టమొదటి లింగాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున కొత్త లింగాలను ప్రతిష్టించారు. కోటిలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. కోటి లింగేశ్వర ఆలయంలో దాదాపు 11 దేవాలయాలు ఉంటాయి. వీటిలో అతి పెద్ద 100 అడుగులకు పైగా ఎత్తులో ఉంటుంది. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో కొలువై ఉంది.

కైలాస నాథుడు..

మహారాష్ట్రలోని అతి పురాతనమైన దేవాలయాల్లో కైలాసనాథ ఆలయం ఒకటి. ఇది ఒకే రాతిపై చెక్కబడిన ఏకశిలా దేవాలయం మరియు ఎనిమిదో శతాబ్దానికి చెందిన భారతీయుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయాన్ని శివ భక్తుడైన క్రిష్ణుడు అనే రాజు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ రాజు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న సమయంలో ఎన్ని మందులు వాడినా, ఎందరు వైద్యులు ప్రయత్నించినా తన రోగం నయం కాలేదు. ఆ సమయంలో క్రిష్ణుని భార్య కైలాసనాథుని ఆలయంలో భక్తితో పరమేశ్వరుడిని ప్రార్థించింది.అక్కడ ఆ స్వామిని మొక్కుకోవడం వల్ల రోగం నయం అయ్యింది..

కేదర నాథ్..

హిందూ దేవాలయాల్లో మరియు 12 జ్యోతిర్లింగాలలో కేదర్ నాథ్ ఒకటి. పార్వతీ దేవి కేదారేశ్వరుడిని ఇక్కడే ప్రార్థించిందని, అందుకే ఈ ప్రదేశం కేదారనాథ్ గా ప్రసిద్ధి గాంచింది అని స్థానికులు చెబుతారు. మరో కథనం మేరకు పాండవులు ఈ ప్రదేశంలో పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారని నమ్ముతారు. ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని ఎత్తైన పర్వతాల్లో ఉంటుంది. ఈ ఆలయాన్ని కేవలం వేసవి, వర్షాకాలంలో మాత్రమే తెరుస్తారు…చలికాలంలో మాత్రం ఓపెన్ చెయ్యరు..

ఈ ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి..అందుకే పర్యాటకుల సందడి కూడా పెరుగుతుంది..ఈ శ్రావణమాసం మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news