
కోస్గి మండల పరిధిలోని నాచారం సమీపంలో డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో రాజు, కలీం, మూస, వెంకట్ కోస్గి మండల వాసులుగా స్థానికులు గుర్తించారు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.