గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే 30 మంది అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. శానిటేషన్ కార్మికులు 55 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. బల్దియాలోని అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కోవిడ్ లక్షణాలతో కమిషనర్ ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు.