ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోమవారం 103 మందికి పరీక్షలు చేయగా 34 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 66 మంది పరీక్షలు చేయగా 31 మందికి, ఆలూరు ఆసుపత్రిలో 37 మందికి పరీక్షలు చేస్తే ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కాగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేసుకొని జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్ సూచించారు.