Siri Hanmanth : బిగ్‌బాస్‌ బ్యూటీ సిరికి కరోనా పాజిటివ్‌

-

కరోనా మహమ్మారి టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు కుదేపిస్తుంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్‌ బారీన చాలా మంది ప్రముఖులు పడ్డారు. ఇక తాజాగా బిగ్‌ బాస్‌ – 5 ఫేమ్, ప్రముఖ యూట్యూబర్‌ సిరి హనుమంతు చేరారు. సిరికి తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని బిగ్‌ బాస్‌ బ్యూటీ స్వయంగా తన సోషల్‌ మీడియాలో తెలిపింది.

sirihanumanth

తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న సిరి… తనను ఈ మధ్య కాలంలో కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను త్వరలోనే కోలుకుని మళ్లీ మీ ముందుకు వస్తానని కూడా చెప్పింది సిరి. కాగా.. టాలీవుడ్‌ లో ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. మహేష్‌ బాబు, త్రిష, విశ్వక్‌ సేన్‌, రాజేంద్ర ప్రసాద్, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, కీర్తి సురేష్‌, వరలక్ష్మి లాంటి ప్రముఖు నటులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అటు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా సోకుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news