ఉప్పల్ MLA భేతి సుభాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ఆకారపు అరుణ్ కుమార్, కంది శ్రావణ్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.