ఈరోజు మహబూబాబాద్ జిల్లా ప్రజల వినతులు స్వీకరించేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశాంక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10-11గం.లకు ఈకార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈమేరకు ఫిర్యాదు దారులు నేరుగా 7995074803కి ఫోన్ చేసి తమ సమస్యల్ని తెలుప వచ్చన్నారు. లేని యెడల కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల పెట్టెలో తమ సమస్యలను రాసి వేయాలని సూచించారు.