ఇటీవల విడుదలైన భీమ్ల నాయక్ సినిమాలో కొన్ని సన్నివేశాలు కుమ్మర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని కుమ్మర్ల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీను అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలో ఒక సన్నివేశంలో కుమ్మరి చక్రాన్ని ధ్వంసం చేయడం, అంతేకాకుండా, కుమ్మరి సారెను కాలితో తన్ని చేతులలోకి తీసుకున్న సీన్‌లు వారి మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు.