
తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్‌లో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సెకండ్ డోస్ 100% వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి గంగుల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది తో కలిసి మంత్రి గంగుల కేక్ కట్ చేశారు.