అందాల తార ..అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడింది. అయితే తన మొదటి సినిమా ధడక్ తోనే మంచి నటిగా ఈ బ్యూటీ అందరి ప్రశంసలు అందుకుంది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ఈ భామ దూసుకుపోతోంది. ఈ జూనియర్ అతిలోకసుందరి తాజాగా నటిస్తున్న చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి.
రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో క్రికెట్ పాత్రలో జాన్వీ కపూర్ నటించనుంది. అందుకోసం ప్రత్యేకంగా టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ వద్ద బ్యాటింగ్ లో శిక్షణ తీసుకుంటోంది ఈ భామ. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను రిపబ్లిక్ డే రోజున సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓపిక లో హెల్మెట్ పెట్టుకొని స్టైలిష్ గా ఈ సుందరి కనిపిస్తోంది. మరో ఫోటోలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా… ఇంకోదాంట్లో మూవీ టీం తో కలిసి సరదాగా ముచ్చటేస్తుంది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే గత ఏడాది నవంబర్ లోనే ఈ వీడియో ని షేర్ చేసి… ఈ సినిమా గురించి దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించాడు.