కరీంనగర్ : కాళేశ్వర క్షేత్రంలో కరోనా కలకలం

కాళేశ్వరంలో రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అడ్డూ అదుపు లేని రవాణా జరుగుతోంది. పుణ్యక్షేత్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. ఇప్పటికే త్రివేణి తీర్థ పురోహితుల్లో ఇద్దరికి కరోనా సోకగా, ఆదివారం కాళేశ్వర క్షేత్ర అర్చకుడికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు 30 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.