కొడాలి నానిపై తిరుగుబాటు తప్పదు..వైసీపీ నేత సంచలనం !

మంత్రి కొడాలి నాని వాడుతున్న తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని.. అది ఇలానే కొనసాగతే.. అతనిపై కార్యకర్తలే తిరుగబడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు. ఒంగోలు ప్రెస్‌ క్లబ్‌ లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి.. కొడాలి నాని వాడుతున్న భాష సరిగా లేదన్నారు.

మంత్రి వాడుతున్న భాషకు కొందరు సంతోషిస్తున్నప్పటికీ.. ఎక్కువ మంది మాత్రం చీదరించుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం ఉంటుందన్నారు. మంత్రి కొడాలి నానిపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చర్యలు తీసు కోవాలని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో తాను గుడివాడ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఒంగోలులో తన ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ఇప్పటి వరకు చర్యలు తీసు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు.