సరూర్‌నగర్ పీఎస్‌లో కరోనా కలకలం

సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 9 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోమ్ గార్డులకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇటీవల తమను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు తెలిపారు.