ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 7 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 1, కరీంనగర్ 2, పెద్దపల్లి 4, సిరిసిల్ల జిల్లాలో కేసులు నమోదుకాలేదు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి సహకరించాలని వైద్యులు కోరారు.