
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన కందుకూరి విజయ, అశోక్ దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు. గురువారం ఆక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ మరణించారు. ఆమె మరణ వార్తను అశోక్ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మృతితో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.