పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

-

ముత్తారం మండలం ఓడేడుకు చెందిన కొలిపాక మనూష (18) ఆరు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన మనూషకు గతేడాది నవంబరు 21న భూపాలపల్లికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ పెళ్లి ఇష్టం లేదంటూ పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పినా వినిపించుకోవడం లేదు. దీంతో ఈ నెల 2న పురుగులమందు తాగింది. కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది.

Read more RELATED
Recommended to you

Latest news