
ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన వెలువరించడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది సన్నద్ధమవగా కొత్తగా మరికొంత మంది రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నిరుద్యోగుల అడ్డాలుగా పేరొందిన అమీర్‌పేట, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి ప్రాంతాలు సందడిగా మారనున్నాయి. ఇన్ని రోజులు వెలవెలబోయిన కోచింగ్ సెంటర్లు నేటి నుంచి కళకళలాడనున్నాయి.