రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్ నియమించడం జరిగింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, హనుమకొండ జిల్లాకు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జనగామ జిల్లాకు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు ఎంపీ మాలోత్ కవిత, ములుగు జిల్లాకు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, భూపాలపల్లి జిల్లాకు జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతిని నియమించారు.