వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

ఎంతో మంది అధికారంలోకి వచ్చినా… వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరంగల్ అభివృద్ధి పరుగు పెడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వరంగల్ లో కళాక్షేత్రం రూపకల్పన చేస్తామని … రానున్న రోజుల్లో దీన్ని అద్భుతమైన మ్యూజియంగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. కాకతీయలు పాలించిన వరంగల్ జిల్లా… తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పింది వరంగల్ జిల్లా అని… కేసీఆర్ పాలనలో మాత్రమే వరంగల్ అభివృద్ధి అవుతుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో వైద్యరంగంలో మొదటిస్థానంలో ఉండబోతుందని అని అన్నారు. కేసీఆర్ వల్లనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని అన్నారు. కేంద్రానికి అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. వరంగల్ ఫోర్ట్, వేయి స్తంబాల దేవాలయానికి యునెస్కో గుర్తంపు తెస్తాం అని అన్నారు. బీజేపీ గుడిపై రాజకీయం చేస్తున్నాయి కానీ గుళ్లకు ఒక్క రూపాయి పెట్టరని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news