ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుపై 54 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు. గతంలో పరకాల, శాయంపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరి మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.