అప్పటి వరకు అంతా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఢిల్లీ పరిసర ప్రాంతంలో భూమి కంపించింది. భయంతో జనాలు పరుగులు తీశారు. దీంతో దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలోని అప్గాన్ హిందూ కుష్ పర్వత శ్రేణిలో భూకంప కేంద్రం 5.7 రిక్టర్ స్కేలుపై తీవ్రత నమోదు అయిందని గుర్తించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జనం భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ఈ భూకంప తీవ్రత ముఖ్యంగా కజకిస్తాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దాని ప్రభావంతో కొద్ది మేరకు ఉత్తర భారతదేశంలో వ్యాపించింది. ఢిల్లీ, అక్కడక్కడ కశ్మీర్ ప్రాంతంలో కూడా స్వల్పంగా నమోదు అయినట్టు తెలుస్తోంది. అక్కడి ప్రజలందరూ టెన్షన్‌లో ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఎలాంటి టెన్షన్ అవసరం లేదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. డిసెంబర్ నెలలో చివరి సారిగా ఢిల్లీలో భూకంపం 4.2 తీవ్రత నమోదు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూకంపం సంభవించలేదు. ప్రస్తుతం భూకంపం భూమి స్వల్పంగా మాత్రమే కంపించిందని, భూకంపం శాస్త్రవేత్తలు పరిశోధన జరుపుతున్నట్టు సమాచారం. మరల కూడా సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచలను చేశారు.