ఎడిట్ నోట్: ‘క్యాసినో’ కొత్త మలుపులు..!

-

ఎక్కడో గోవా, నేపాల్, శ్రీలంక లాంటి టూరిస్ట్ ప్రాంతాల్లో జరిగే క్యాసినో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏదో గత సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యాసినో జరిగిన అంశంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు దీనిపై ప్రతిపక్ష టీడీపీ…కొడాలి నాని టార్గెట్ గా విమర్శలు చేసింది…కానీ నాని…తనకేం సంబంధం లేదని తేల్చి చెప్పేశారు…తర్వాత తర్వాత ఆ క్యాసినో వ్యవహారం ఏమైందో ఎవరికి క్లారిటీ లేదు.

అయితే తాజాగా క్యాసినో ఏజెంట్లుగా ఉన్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్ళల్లో ఈడీ సోదాలు నిర్వహించింది..అలాగే ఇరువురుని ఈడీ అధికారులు విచారించారు. ఇక నేపాల్, గోవా లాంటి ప్రాంతాల్లో క్యాసినో అధికారికంగానే నిర్వహించామని, తాము చట్టవిరుద్ధంగా ఏం చేయలేదని ప్రవీణ్ చెబుతున్నాడు..మళ్ళీ ఈడీ విచారణకు పిలిచిందని, హాజరవుతానని అంటున్నారు. ఇక ఇదంతా పై పైన జరిగిన కథ…ఇక దీని వెనుక చాలా చీకటి కథలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే ప్రవీణ్…మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్న కారుని వాడుతున్న విషయం బయపడిన విషయం తెలిసిందే…ఆ కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదని మల్లారెడ్డి చెప్పారు. ఇక ఈ క్యాసినో చీకటి కథలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు నాయకులు ఉన్నారని బయటపడింది. అలాగే ఇంకా పలువురు బిజినెస్ ప్రముఖులు కూడా ఉన్నారని తేలింది…వీరితో ప్రవీణ్ కు కాంటాక్ట్స్ ఉన్నాయని, వారిలో కొందరిని నేపాల్ కు తీసుకెళ్లి క్యాసినో ఆడించారని తెలుస్తోంది.

అదే సమయంలో క్యాసినోలు నిర్వహించేచోట వినోదాన్ని అందించేందుకు సినీ తారలను రప్పించేవారని, ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటీమణులు మల్లికా షెరావత్‌, అమీషా పటేల్‌, టాలీవుడ్ కు చెందిన ముమైత్‌ ఖాన్‌, ఈషా రెబ్బా, డింపుల్‌ హయతిలతో పాటు కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య వంటివారు నేపాల్ వెళ్లారని తెలుస్తోంది. వీరికి భారీగానే డబ్బులు కూడా ముట్టచెప్పారని తెలుస్తోంది.

అయితే ఇక్కడ సినీ ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి గాని…రాజకీయ ప్రముఖుల పేర్లు మాత్రం బయటపడటం లేదు…రాజకీయ నేతల పేర్లు బయటపెట్టే విషయంలో ఏమైనా ఒత్తిడి ఉందా? అనేది తెలియడం లేదు. మొదట నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఉన్నారని వినిపిస్తుంది…కానీ ఎవరో మాత్రం బయటపడటం లేదు.

పైగా ప్రవీణ్ పైకి క్యాసినో వ్యవహారం నడిపిస్తున్నా సరే…అతడి అసలు వ్యాపారం హవాలాయే అని ఈడీ అధికారులు భావిస్తున్నారు. అలాగే సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించగా.. అతడికి నలుగురు హవాలా ఆపరేటర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని సమాచారం. మొత్తానికైతే తీగ లాగితే డొంక కదిలినట్లు ప్రవీణ్, మాధవరెడ్డిలని విచారిస్తే…తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు బయటపడుతున్నారు. కాకపోతే రాజకీయ నేతల పేర్లు మాత్రం బయటకు రావడం లేదు..మరి త్వరలో క్యాసినో నేతల పేర్లు బయటకొస్తాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news