ఎడిట్ నోట్: ఫ్లైట్‌తో నేషనల్ పాలిటిక్స్..!

-

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 5 దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ బలపడటం మొదలైంది..అప్పటినుంచి కేసీఆర్ దూకుడుగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి గత ఎన్నికల ముందు కూడా ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడిగా తిరిగారు గాని..అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

కానీ తెలంగాణలో బీజేపీ బలపడటం..అన్నిరకాలుగా కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీ టార్గెట్ చేయడంతో..కేసీఆర్ రూట్ మార్చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదపడం మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీలని కలిశారు. ఆయా పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు. ఇక అక్కడ నుంచి మోదీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. బీజేపీ వల్ల దేశం నాశనమైపోతుందని, మతతత్వ పార్టీని తరిమికొట్టాలని కేసీఆర్..బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అటు బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి.

అయినా కూడా కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా..బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. తెలంగాణలో తమని గద్దె దించాలని చూస్తున్న బీజేపీని కేంద్రంలోనే గద్దె దించేయాలని చూస్తున్నారు. అయితే ఏదో రాష్ట్రంలో రాజకీయం చేస్తూ..కేంద్ర రాజకీయాల్లో తిరిగితే సరిపోదు అని డిసైడ్ అయ్యి..జాతీయ పార్టీ పెట్టడానికి రెడీ అయిపోయారు.

జాతీయ పార్టీ ద్వారా..కేంద్రంలో చక్రం తిప్పాలని చెప్పి కేసీఆర్ చూస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలని ఒక కూటమిగా ఏర్పాటు చేసి..కేంద్రంలో పాగా వేయాలని చూస్తున్నారు. ఇక ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటుందా? లేదా? అనేది క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటుందని తెలుస్తోంది. ఇక కూటమి గురించి పక్కన పెడితే..ఇప్పటికే కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలని ఖరారు చేసుకున్నారు.

అలాగే దసరా రోజున పార్టీ పెత్త్దనికి రెడీ అవుతున్నారు. కరీంనగర్ వేదికగా భారీ సభ పెట్టి..అక్కడే జాతీయ పార్టీ ప్రకటన చేయాలని భావిస్తున్నారు. అయితే పార్టీ పేరు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ అని వినిపిస్తుంది..అంటే భారత్ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ ఆవిర్భావం కూడా కరీంనగర్ వేదికగానే జరిగింది..ఇప్పుడు అక్కడే జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు. అలాగే ఢిల్లీలో కూడా ఒక సభ పెడతారని తెలుస్తోంది. ఇక జాతీయ పార్టీ అధ్యక్షుడుగా కేసీఆర్ ఉండనున్నారు.

జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండటానికి..సమయం వృధా కాకుండా ఉండటానికి కేసీఆర్..వంద కోట్లు పెట్టి ఒక విమానం కూడా కొనుగోలు చేశారు. పార్టీలోని పది మంది నాయకులు ఈ విమానం కొనుగోలు కోసం విరాళాలు ఇచ్చారు. మొత్తానికి విమానంతో జాతీయ రాజకీయాల్లో రౌండ్ వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news