ఎడిట్ నోట్: కమలానికి అభయ’హస్తం’..!

-

తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి…ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందని అనుకోవచ్చు…అయితే టీఆర్ఎస్ తర్వాత సెకండ్ ఉన్న పార్టీ ఏది ఉంటే…బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో క్లారిటీ లేదని చెప్పాలి…ఒకోసారి కాంగ్రెస్ రేసులో ముందు ఉన్నట్లు కనిపిస్తుంది…మరొకసారి బీజేపీ ముందు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇదంతా కాదని చెప్పి…ఏకంగా కాంగ్రెస్ పార్టీనే థర్డ్ ప్లేస్ కు తోసేయాలని బీజేపీ ఓ రేంజ్ లో వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతుంది.

రాష్ట్రంలో వాస్తవ పరిస్తితులని చూసుకుంటే…టీఆర్ఎస్ విషయం పక్కన పెడితే…బీజేపీ ఇప్పుడు బలపడుతుంది..అలా అని కాంగ్రెస్ పార్టీకి బలం తక్కువ అనుకోవడానికి లేదు. బీజేపీ కంటే..క్షేత్ర స్థాయిలో కేడర్ బలంగాని, నాయకత్వం గాని కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అదే రుజువైంది. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు…టీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేసుకుంటే బీజేపీకి పని జరగదు. ముందు కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించి…అప్పుడు టీఆర్ఎస్ ని దెబ్బకొట్టాలి.

అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ పై యుద్ధం చేసిన బీజేపీ…ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులని లాగే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే టీఆర్ఎస్ లోకి చాలామంది కాంగ్రెస్ నేతలు వెళ్లారు…ఇక ఇప్పుడు మిగతా వారిని బీజేపీలోకి లాగాలని చూస్తుంది. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే పడని వారిపైనే కమలం ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.

అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి బలమైన నేతలని టార్గెట్ చేసింది…ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక ఖాయమైంది…అటు వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వచ్చేస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే దాసోజు శ్రావణ్ సైతం కాంగ్రెస్ పార్టీని వదిలారు. ఆయన కూడా బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇంకా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో బలపడేందుకు..ఆయా జిల్లాలో ఉన్న బలమైన కాంగ్రెస్ నేతలని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అమిత్ షా ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంటే బలమైన కాంగ్రెస్ నేతలని లాగితే..వారి వెనుక బలమైన కాంగ్రెస్ కేడర్ కూడా వస్తుందనేది కమలం ప్లాన్. కేడర్ కూడా వస్తే బీజేపీ బలం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కాంగ్రెస్ బలమంతా బీజేపీకి కలిసొస్తుంది. అప్పుడు టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి బీజేపీ బలం సరిపోతుంది.

అంటే అసలు టార్గెట్ టీఆర్ఎస్ అయినా సరే…ముందు కాంగ్రెస్ పార్టీని కిందకు నెట్టి..పైకి లేవాలనేది బీజేపీ ప్లాన్…తద్వారా చివరికి టీఆర్ఎస్ ని ఓడించి..అధికారం దక్కించుకోవచ్చు అని కమలదళం చూస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే కమలం పార్టీ పనిచేస్తుంది…ఇప్పుడు హస్తం పార్టీనే కమలానికి అభయ హస్తంగా మారిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news