ఎడిట్ నోట్: ట్యాపింగ్..కోవర్టు.!

-

ఏపీలో అధికార వైసీపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వమే తన ఫోన్ ట్యాపింగ్ చేయిందని, ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని, ఇంకా వైసీపీలో ఉండలేనని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయనని చెప్పి వైసీపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అది ట్యాపింగ్ కాదని రికార్డింగ్ మాత్రమే అని, కావాలని కోటంరెడ్డి టి‌డి‌పిలోకి వెళ్లడానికి ఇలా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు.

అయితే వెంటనే కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ట్యాపింగ్ పై కొన్ని ఆధారాలు చూపించారు. తనది, తన ఫ్రెండ్‌ది ఐఫోన్లు అని అవి రికార్డ్ అవ్వవని, అలాంటప్పు ట్యాపింగ్ అయింది కదా అని అన్నారు. అలాగే ఇంటిలిజెన్స్ చీఫ్ తనకు డైరక్ట్ గా ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. తనదే కాదు ఇంకా 35 మంది ఎమ్మెల్యేలు, 4 గురు ఎంపీలు, ఇద్దరు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని బాంబ్ పేల్చారు. ఈ దెబ్బతో కోటంరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.

తాను టీడీపీలోకి వెళ్తానని, సీటు ఇచ్చేది లేనిది చంద్రబాబు ఇష్టమని చెప్పారు. అటు ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. ఆయన కూడా వైసీపీకి దూరమయ్యారు. ఇంకా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమవుతారని తెలుస్తోంది.

అయితే వీరు టి‌డి‌పిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు..కాకపోతే వీరితో చంద్రబాబు చర్చలు చేసినట్లు కనబడలేదు. వారే టీడీపీలోకి వస్తామని అనడంతో టి‌డి‌పి శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఇందులో ఏదో కుట్ర ఉందని, అది జగన్‌కు వీర విధేయుడైన కోటంరెడ్డి టి‌డి‌పిలోకి రావడాన్ని అనుమానిస్తున్నారు. ఏదో కోవర్టు ఆపరేషన్ జరుగుతుందని, టి‌డి‌పిని దెబ్బకొట్టే కుట్రలో భాగంగా ఇదొక స్కెచ్ ఏమో అని అనుమానిస్తున్నారు. టి‌డి‌పి సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సైతం..ఇది కోవర్టు వ్యూహం..వైసీపీ ఆడుతున్న డ్రామా అని, జాగ్రత్తగా ఉండాలని తెలుగు తమ్ముళ్ళకు సూచించారు. మొత్తానికి ఓ వైపు వైసీపీకి షాకులు తగులుతుంటే..టీడీపీ ఏమో కోవర్టు ఆపరేషన్ అని భయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news