ఎడిట్ నోట్: పోల్ ఫైట్..!

-

మునుగోడు ఉపఎన్నిక మొదలైపోయింది..నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల ఓటర్లు..ఓటు వేసే పనిలో పడ్డారు. దాదాపు 2.41 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 47 మంది మునుగోడు బరిలో ఉన్నారు. వారిలో మునుగోడు ఓటరు ఎవరు వైపు నిలబడతారనేది..6వ తేదీ ఆదివారం తేలిపోనుంది. అయితే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రధాన పార్టీలు ముందుకు నడిచాయి. అయితే ఓ వైపు పోలింగ్ జరుగుతున్నా..మరోవైపు పార్టీల మంది ఆగలేదు.

ఎక్కడకక్కడ ఫేక్ న్యూస్‌లు బయటకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి, బీజీపీ నేతలు టీఆర్ఎస్‌లోకి వస్తారని ప్రచారం జరిగింది. అటు బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్లు ఓ ఫేక్ లెటర్ కూడా సృష్టించారు. ఇది ఫేక్ అని బండి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కర్నే ప్రభాకర్ బీజేపీలో చేరబోతున్నారని మరో ప్రచారం వచ్చింది. దానికి కర్నే పార్టీ మారడం లేదని, ఇదంతా బీజేపీ ఫేక్ డ్రామా అని వివరణ ఇచ్చుకున్నారు.

ఇటు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి..కేసీఆర్‌ని కలిశారని మరో ప్రచారం వచ్చింది…ఇదంతా బీజేపీ గేమ్ అని స్రవంతి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలా ఎక్కడక్కడ ఓట్ల కోసం పార్టీలు మైండ్ గేమ్ ఆడేస్తున్నాయి. ఈ పోలింగ్ రోజు కూడా పార్టీలు తమదైన శైలిలో ఓట్లు రాబట్టడానికి..పోలింగ్ మేనేజ్‌మెంట్ చేయడానికి కష్టపడుతున్నాయి.

అయితే ఇప్పటికీ మునుగోడు ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతున్నారో క్లారిటీ రావడం లేదు. కానీ మూడు పార్టీలు మాత్రం..ఎవరికి వారు గెలిచేస్తామనే ధీమాలో ఉన్నారు. అటు బి‌ఎస్‌పి, టి‌జే‌ఎస్ పార్టీలు సైతం తమ సాధ్యమైన మేర ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక ఆటలో అరటి పండు అన్నట్లు కే‌ఏ పాల్ సైతం తనదైన శైలిలో హల్చల్ చేస్తున్నారు. ఇలా మునుగోడులో పోల్ ఫైట్ నడుస్తోంది. ఇక 2.41 లక్షల ఓటర్లలో ఎంతమంది ఓటు వేసి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారో చూడాలి. అలాగే మెజారిటీ ఓటర్లు ఎవరి వైపు నిలబడతారో చూడాలి. రెండు రోజుల్లో మునుగోడు సొంతం చేసుకునేది ఎవరో తేలిపోనుంది. చూద్దాం మునుగోడులో పైచేయి ఎవరిదో.

Read more RELATED
Recommended to you

Latest news