ఎడిట్ నోట్ : ఆ అన్నకు చెల్లెళ్ల గండం…

-

జ‌గ‌న్ కు గండం ఉంది. ఆ గండం అటు చెల్లి ష‌ర్మిల రూపంలో మ‌రో చెల్లి సునీత రూపంలో..డాక్ట‌ర్ సునీత అని రాయాలి.ఆమె హైద్రాబాద్ అపోలోలో పేరొందిన డాక్ట‌రు. పెద‌నాన్న  వార‌స‌త్వం కొన‌సాగిస్తున్న బుజ్జాయి త‌ను.వైఎస్ వివేకానంద రెడ్డి గారాల‌ప‌ట్టి త‌ను.ఇక త్వ‌ర‌లో పులివెందులలో జ‌గ‌న్ తో త‌ల‌బ‌డనున్నారు అన్న వార్త ఒక‌టి వ‌స్తోంది.నాన్న మ‌ర‌ణంపై న్యాయ పోరాటం చేస్తూ, సీబీఐ దర్యాప్తు కోరుతూ త‌రువాత ప‌రిణామాలలో కూడా యాక్టివ్ కూడా ఉంటూ వ‌స్తున్న సునీత ఓ సందర్భంలో త‌న‌కు అన్న జ‌గ‌న్ స‌ర్కారు పై కొన్ని అనుమానాలు ఉన్నాయ‌ని కూడా అన్నారు.త‌రువాత ఎందుకో ఆమె వెనక్కు త‌గ్గారు. వాస్త‌వానికి వైఎస్ వివేకా హ‌త్య ఫ్యామిలీ మేట‌ర్ అని తేల్చేయ‌డానికి ఎక్కువ‌గా వైసీపీ శ్రేణులు క‌ష్ట‌పడుతుంటారు కానీ ఆ హ‌త్య వెనుక సొంత ఇంటి మ‌నుషులే ఉన్నార‌న్న అభియోగాలు టీడీపీ త‌ర‌ఫున వినిపిస్తూ ఉంటాయి.

ఇక తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమెను త‌మ పార్టీ త‌ర‌ఫున పులివెందుల‌లో నిల‌బెట్టాల‌ని యోచిస్తున్నారు చంద్ర‌బాబు. అయితే కుటుంబ త‌గాదాల‌ను రాజ‌కీయంగా వాడుకోవ‌డం చంద్ర‌బాబుకు అల‌వాటే అన్న ఆరోప‌ణ ఒక‌టి ఇదే స‌మ‌యంలో టీడీపీ వ్య‌తిరేక వ‌ర్గం నుంచి వ‌స్తుంది.జ‌గ‌న్ కూడా సునీత రాజ‌కీయ అరంగేట్రాన్ని అడ్డుకోరు కానీ ఎందుక‌నో మొద‌టి నుంచి సునీత అన్న స‌ర్కారుపై పెద్ద‌గా న‌మ్మ‌కాలు అయితే ఉంచ‌డం లేదు అన్న‌ది వాస్త‌వం. వివేకా మ‌ర్డ‌ర్ వెనుక అవినాశ్ రెడ్డి హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ ద‌ర్యాప్తులో రుజువు అవ్వాలి.అందాక ఏం రాసినా అవ‌న్నీ కేసును ప్ర‌భావితం చేస్తాయి. కేవ‌లం ఊహాగానాల మేర‌కు అనుకుంటున్నారు.. చెప్పమ‌ని ప్రోత్స‌హిస్తున్నారు.. ఆ విధంగా తెలిపారు అని రాయ‌డం మాత్రం ఫ‌క్తు వాస్త‌వ విరుద్ధం.క‌నుక అటు ష‌ర్మిల కానీ ఇటు సునీత కానీ జ‌గ‌న్ కు రేప‌టి వేళ ఇంటి పోరే ! క‌నుక ఇంటి పోరు ఇంతింత కాద‌యా!

Read more RELATED
Recommended to you

Latest news