మొన్నటి వరకు ఫలాన హీరో నెక్ట్స్ సినిమా ఎవరితో అంటే నో కామెంట్. ప్రస్తుత సినిమా పూర్తయిన తర్వాతే తదుపరి సినిమాపై క్లారిటీ ఇస్తారట అనే కామెంట్స్ వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో రెండు మూడు సినిమాలని లైన్‌లో పెడుతున్నారు మన హీరోలు.
సైరానరసింహారెడ్డిలో నటిస్తున్న చిరంజీవి నెక్ట్స్ కొరటాల శివ, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలకు ఓకే చెప్పారు. అలాగే మన్మథుడు2, బ్రహ్మాస్ర్తలో నటిస్తున్న నాగార్జున నెక్ట్స్ బంగార్రాజులో చేయనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఎలక్షన్ల వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఒకేసారి రెండు నయా మూవీస్‌ని ప్రకటించారు. మొదట జై సింహా ఫేమ్ కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం బోయపాటి శ్రీనుతో సింహా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అవుతున్నారు.
మహర్షిలో నటిస్తున్న మహేష్ తదుపరి సినిమా అనిల్ రావిపూడితో ఉంటుంది. ఆ తర్వాత కొరటాలతోనూ ఓ ప్రాజెక్ట్ ఉంటుందట. ఓ వైపు సాహోతో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అనంతరం కేజీఎఫ్ దర్శకుడితో ఓ సినిమా, బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఇటీవల ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లను ప్రకటించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. అందులో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయనున్నారు. ఆ తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందట. మరోవైపు బాలీవుడ్ ఎంట్రీకి కూడా ప్లాన్ జరుగుతుందట.
ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న గోపీచంద్ మరోవైపు కొత్త దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం డైరెక్షన్‌లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది ఇటీవలే ప్రారంభమైంది. అనంతరం సంపత్ నందితో ఓ సినిమా చేయనున్నారు. డియర్ కామ్రేడ్ చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్ట్స్ క్రాంతి మాధవ్‌తో ఓ మూవీ, ఆనంద్ డైరెక్షన్‌లో హీరో చేయనున్నారు. అలాగే శివ నిర్వాణతోనూ ఓ కమిట్‌మెంట్ ఉందట.
ఇక నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ చేస్తున్నారు. నెక్ట్స్ ఇంద్రగంటిమోహనకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రీసెంట్‌గానే షురూ అయ్యింది. నాగచైతన్య వెంకీమామలో నటిస్తుండగా, అనంతరం బంగార్రాజు, అలాగే అజయ్ భూపతి దర్శకత్వంలో, ఓ డెబ్యూ డైరెక్టర్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఇలా శర్వానంద్, నాగశౌర్య, నితిన్, రవితేజ వంటి హీరోలంతా ఒకే సారి రెండు మూడు ప్రాజెక్ట్ లని లైన్‌లో పెడుతూ దూకుడు పెంచుతున్నారు.