ఎడిట్ నోట్: గురివింద నీతి..!

-

ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు సొంత తప్పులు గురించి తెలుసుకోరు గాని…ఎదుటవారి తప్పులని మాత్రం బాగా చెబుతారు. అంటే గురివింద గింజ సామెత మాదిరి…అంటే గురివింద గింజ…తన పైన ఉన్న ఎరుపుని చూసి మురిసిపోతుంది గాని…కింద ఉన్న నలుపు గురించి మరిచిపోతుందంటా…అదే మాదిరిగా నేటి రాజకీయాల్లో నేతలు…తమ తప్పులని మరిచిపోయి…ఎదుటవారి తప్పులు ఎత్తుతూ నీతులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎం పార్టీల నేతలు చేసే వ్యాఖ్యలు అలాగే ఉన్నాయని చెప్పొచ్చు.

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్…తాజాగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు వివాదాల్లో ఉండే రాజాసింగ్..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు…అయినా సరే ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పు. అందుకే ఆయన్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడనే కాదు…ఆయన గతంలో పలుమార్లు ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడేవారు. అయితే తాజాగా జరిగిన సంఘటనలో రాజాసింగ్ అరెస్ట్ కావడం, వెంటనే బెయిల్ రావడం జరిగిపోయాయి.

అయితే రాజాసింగ్‌కు బెయిల్ రావడంపై…ఎం‌ఐ‌ఎం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి…ఆయన్ని అరెస్ట్ చేయాలని, అలాగే ఆయన ఎమ్మెల్యే పదవిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఎం‌ఐ‌ఎం శ్రేణులు పాతబస్తీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీని వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలీసులు నిరసనకారులని అదుపు చేసే కార్యక్రమం చేస్తున్నారు.

ఎక్కడైనా ప్రజస్వామ్యంలో నిరసన తెలియజేయొచ్చు గాని…దాన్ని దాటేసి…శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చేయకూడదు…పైగా వారం రోజుల్లో గణేశ్ చతుర్థి ఉంది…ఇలాంటి సమయంలోనే పాతబస్తీలో జరిగే సంఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే పాతబస్తీలో అల్లరులు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎం పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు పాతబస్తీలో జరిగే కార్యక్రమాలు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు.

అదే సమయంలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే…బీజేపీ సస్పెండ్ చేసింది…అయినా సరే బీజేపీనే టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. అసలు టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎం పార్టీ నేతలు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయనట్లే గురివింద నీతి ప్రదర్శిస్తున్నాయి. ఎం‌ఐ‌ఎం నేతలు ఎన్నిసార్లు మతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా అక్బరుద్దీన్ ఒవైసీ…భైంసాలో ఎలాంటి స్పీచ్‌లు ఇచ్చారో తెలిసిందే.

ఇటు టీఆర్ఎస్ భోదన్ ఎమ్మెల్యే షకీల్ సైతం ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలిసిందే…అయినా సరే తమ తప్పులని మరిచిపోయి…టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎం పార్టీలు కేవలం బీజేపీ టార్గెట్ గా రాజకీయం చేస్తున్నాయి. అలాగే బీజేపీని ప్రజల్లో బద్నామ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు..అయినా సరే ప్రజలకు నిజనిజాలు మాత్రం అర్ధమవుతాయనే చెప్పొచ్చు..టీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎం గురివింద నీతి గురించి తెలుస్తుందనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news