ఇంత జరుగుతున్నా జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు…?

509

అది పల్నాడు… అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు చూసిన నేల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ రాజకీయాలకు రాయలసీమ ఏ స్థాయిలో పాపులర్ అయిందో పల్నాడు కూడా అదే విధంగా పాపులర్ అయింది. ఇప్పటికి అక్కడ ఏదోక సంచలనం జరుగుతూనే ఉంటుంది. అలాంటి పల్నాడు విషయంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేది వాస్తవం.

రాజకీయంగా ఎంత బలంగా ఉన్న పార్టీ అయినా సున్నిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫెయిల్ అయ్యారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మాచర్లలో బుధవారం జరిగిన సంఘటన ఇప్పుడు జగన్ పై విమర్శలకు వేదికగా మారింది. ప్రతిపక్ష నేతలు వెళ్ళిన సమయంలో అలాంటి దాడి అనేది ఎంత వరకు సమంజసం అనేది వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి.

ఏ మాటకు ఆ మాట టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి అవాంచనీయ సంఘటనలను తొక్కి పట్టారు. జగన్ అనుచరుడు అని ఎల్లో మీడియా గా ముద్ర వేసిన పత్రికలూ రాస్తున్నాయో లేక ఎవరు రాస్తున్నారో పక్కన పెడితే మాచర్ల టౌన్ కి అతను కీలక నాయకుడు. అతని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని ఫోటోలు జగన్ తో ఉన్నవి ఇతరులతో ఉన్నవి వైరల్ అవుతున్నాయి.

వైసీపీ నేతలు కూడా దీనిని తప్పుబడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది. రాజకీయంగా జగన్ అత్యంత బలంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ చర్యలు ఎంత వరకు ఆయనకు మంచివి కావు. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుండేది అనే వారు కూడా ఉన్నారు. ఎవరో పిల్లాడిని టీడీపీ నేతలు గుద్దారు అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

కాని అక్కడ అప్పటికే వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగింది. అతను దాడి చేసిన విధానం చూసి చాలా మంది భయపడ్డారు. పల్నాడు అనేది సున్నిత ప్రాంతం… ఇలాంటి విషయాల్లో జగన్ గనుక సైలెంట్ అయ్యారు అంటే మాత్రం పార్టీకి ఇబ్బందికరమే. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవడం అనేది అవసరం.